News

బాలవికాస్‌ విద్య నేటి సమాజానికి ఆదర్శం

242views

బాల్యం నుంచే విలువలు, విజ్ఙానంతో పాటు ఆధ్యాత్మికత సంస్కృతిపై జ్ఙానాన్ని ఇచ్చే బాలవికాస్‌ విద్యా విధానం నేటి సమాజానికి ఆదర్శమని సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా ప్రెసిడెంట్‌ నిమీష్‌ పాండ్య పేర్కొన్నారు. రెండు రోజుల సత్యసాయి బాల వికాస్‌ 16వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ముగిసింది. ముగింపు వేడుకల్లో భాగంగా ఉదయం తమిళనాడుకు చెందిన బాలవికాస్‌ విద్యార్థులు బ్రాస్‌ బాండ్‌ వాయిద్యంతో కాన్వొకేషన్‌ ర్యాలీ సాయికుల్వంత సభా మందిరం వరకూ నిర్వహించారు. ఒడిస్సాకు చెందిన బాలవికాస్‌ బాలికలు నృత్య ప్రదర్శన నిర్వహించారు. చక్కటి నృత్య భంగిమతో వారు నిర్వహించిన ప్రదర్శన భక్తులను మైమరపించింది. అనంతరం 13వ బాలవికాస్‌ ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహించారు. బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలవికాస ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు.