News

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి

143views

హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శరణాగతి గోష్ఠి పీఠాధిపతి నరేంద్రరామానుజ దాస స్వామి తెలిపారు.గుంటూరు జిల్లా నగరం మండల కేంద్రమైన నగరంలో సోమవారం జరిగిన హిందూ సమ్మెళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. హిందూ మతం భారతీయులకు ఆత్మ లాంటిందని.. అలాంటి ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తొలుత నగరం పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచారక్‌ జంజనం హేమశంకర్రావు, సీతాపతి, సత్యనారాయణ, మురళీకృష్ణ, శివరాంబాబు పాల్గొన్నారు.