News

రామాయణం చదివితే అద్భుత ఫలితాలు

266views

విద్యార్థులు, యువత మంచి పనులకు ముందడుగు వేయాలని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసనాయుడు తెలిపారు. విజయనగరంలోని రామనారాయణం వాల్మీకి పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ‘వారధి 2026: రామాయణ ఫర్ యంగ్ ఇండియన్స్’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, గురువులు గౌరవించాలని యువతకు సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని నిరంతరం సాధన చేయాలన్నారు. రామాయణం చదివితే అద్భుత ఫలితాలు సాధిస్తారన్నారు. రామాయణంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్. ఎస్ శాస్త్రి, కేంద్రం డైరెక్టర్ హెచ్. లజపతిరాయ్, సమన్వయకర్త గౌరీ నిత్య, ధర్మకర్తలు నారాయణమ్మ నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.