News

‘కాశ్మీరీ హిందువులు ఎప్పటికీ శాశ్వతంగా లోయకు తిరిగి రారు’: ఫరూక్ అబ్దుల్లా

181views

కశ్మీర్ హిందువులు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా అన్నారు..రాజౌరి జిల్లాలోని నౌషేరాలో మీడియాతో ఆయన మాట్లాడారు. హిందువులే కాదు, ముస్లింలు కూడా ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు కశ్మీర్‌ హిందువులు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవన్నారు.

కాశ్మీర్‌ లోయలో ఉన్న కాశ్మీరీ పండిట్లు దేశంలో వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇప్పుడు వారి పిల్లలు పిల్లలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఉద్యోగం, విద్య వంటి కారణాల వల్ల వారు అక్కడే నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడైనా కాశ్మీర్‌ని సందర్శించడానికి వస్తారు కానీ, శాశ్వతంగా ఉండిపోవడానికి వస్తారా? అని ఫరూక్‌ సందేహం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా కాశ్మీర్‌ హిందువులకు  పునరావాసం కల్పించాలని డిమాండ్‌ గురించి ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘వారు (కాశ్మీర్‌ హిందువులు) కాశ్మీర్‌కి ఎప్పుడు తిరిగి వస్తారు? వస్తే వాళ్లని ఎవరు ఆపుతున్నారు? వాళ్లను ఎవరూ ఆపడం లేదని అన్నారు.