News

తిరుప్పావై ప్రవచనాలు శుభకరం

193views

పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలను వినడం ఎంతో మంచిదని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో గత 26 రోజులుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్దానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు చేసిన తిరుప్పావై ప్రవచనాన్ని ఆయన విన్నారు. అనంతరం మందిరంలోని శ్రీ కృష్ణభగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుం శ్రీనివాసులు రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఎంతో పురాతనమైన గీతామందిరంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. ప్రవచనాలు చేస్తున్న పొన్నూరి వెంకటశ్రీనివాసులును ఆయన అభినందించారు. ప్రజలందరికీ గోదాదేవి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.