
146views
ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డా.కడవెండి వేణుగోపాల్ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. భార్య అరుణకుమారి సహకారంతో 15 ఏళ్లుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 180 పాఠశాలల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి సొంత డబ్బుతో జూట్, క్లాత్ బ్యాగులు తయారు చేయించి పంపిణీ చేశారు. వేసవిలో విత్తనాలు సేకరించి వర్షాకాలంలో ఖాళీ స్థలాలు, అడవుల్లో విత్తన బంతులను చల్లుతున్నారు. వీరు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 2, రాష్ట్ర స్థాయిలో 10 అవార్డులు పొందారు.





