News

మైనర్ పై లైంగిక వేధింపు కేసులో కెనడాలో కేరళ ఫాదర్ అరెస్ట్

217views

లైంగిక వేధింపుల కేసులో కేరళకు చెందిన కేథలిక్ ఫాదర్ ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు.కోజికోడ్‌కు చెందిన ఫాదర్ జేమ్స్ చెరికల్, కొచ్చిలోని సిరో-మలబార్ చర్చికి చెందిన ఫాదర్. కేరళలో అత్యంత కీలకమైన చర్చి. కేథలిక్, రోమ్ ఆధ్వర్యంలోని 23 ఓరియంటల్ చర్చిల్లో ఒకటి.

అరెస్టు తర్వాత, ఫాదర్ జేమ్స్ చెరికల్‌ను టొరంటో ఆర్చ్ డియోసెస్ పాస్టోరల్ ఆయన్ను తొలగించింది. ఫాదర్ జేమ్స్ చెరికల్ తమరస్సేరిలోని సిరో-మలబార్ డియోసెస్‌కు చెందిన వ్యక్తి. ఆయన దాదాపు 3 దశాబ్దాల పాటు టొరంటో ఆర్చ్ డియోసెస్ కింద వివిధ పారిష్‌లలో పనిచేయడానికి నియుక్తులయ్యారు.

చెరికల్ అరెస్ట్ నేపథ్యంలో టొరంటో ఆర్చ్ డియోసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘బ్రాంప్టన్‌లోని సెయింట్ జెరోమ్స్ కాథలిక్ చర్చి పాస్టర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్చ్ డయోసెస్‌లో పని చేస్తున్న ఫాదర్ జేమ్స్ చెరికల్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయని టొరంటో ఆర్చ్ డయోసెస్ తెలుసుకుంది. డిసెంబర్ 18 న పీల్ పోలీసులు ఫాదర్ చెరికల్ పై లైంగిక వేధింపుల నేరం, లైంగిక జోక్యం అన్న పేరుతో అభియోగం మోపారు. కెనడియ న్యాయ వ్యవస్థలో ఎవరైనా దోషిగా నిరూపితం అయ్యే వరకూ నిర్దోషిగానే చూస్తాం. అలాగే అతడు చట్టపరమైన ప్రక్రియ కోసం హక్కులు కూడా కలిగి వుంటాడు’’ అని పేర్కొంది.