
అసోంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రకుట్ర కేసులో కీలక నిందితుడు కమరుద్దీన్ (డాక్టర్ హురైరా) ఎన్ఐఏ కోర్టు దోషిగా నిర్ధారించింది, జీవిత ఖైదు విధించింది.2017, 18 ప్రాంతంలో అసోం కేంద్రంగా హిజ్బుల్ ముజాహిదీన్ మాడ్యుల్ ను స్థాపించడానికి కుట్ర పన్నాడని,అలాగే ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించే పనిలో కూడా వున్నాడని, వీటితో ప్రజల్లో భయాన్ని రేకెత్తించే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ కోర్టు ముందు విన్నవించింది.
వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు జమాన్ కి మూడు వేర్వేరు జైలు శిక్షలతో పాటు గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 లోని సెక్షన్ 18 కింద అతనికి జీవిత ఖైదు విధించబడింది.అలాగే UA(P) చట్టంలోని సెక్షన్ 18B తో కలిపి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 120B కింద ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, అలాగే చట్టంలోని సెక్షన్ 38 కింద మరో ఐదు సంవత్సరాలు జైలు శిక్షను విధించింది కోర్టు. ఇవన్నీ ఏక కాలంలోనే అమలు అవుతాయని కూడా కోర్టు పేర్కొంది.
జైలు శిక్షలతో పాటు, మూడు కేసులలో ఒక్కొక్కదానికి రూ. 5,000 జరిమానా విధించింది, ప్రతి కేసులోనూ దోషిగా తేలితే అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.
RC 08/2018/NIA-GUW గా నమోదైన ఈ కేసు అస్సాంలోని హోజై జిల్లాలోని జమునాముఖ్ ప్రాంతానికి సంబంధించినది. రాష్ట్రంలో నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థను నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి కమ్రూజ్ జమాన్ చురుకుగా కుట్ర పన్నాడని NIA దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఉగ్రకుట్రలకు, ఉగ్రమూలాల విస్తరణకు, ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి స్థానిక యువతను కూడా రిక్రూట్ చేసుకున్నాడని, వారిని కూడా ఇస్లామిక్ ఉగ్రవాదంలోకి లాగడంలో జమాన్ కీలక పాత్ర పోషించాడు.





