
254views

నంద్యాల జిల్లా, యన్ కొత్తపల్లి, శ్రీ శారదా విద్యా పీఠం విద్యార్థులు నిర్వహించిన “స్వయం పరిపాలనా దినోత్సవం” అందరిని ఆకట్టుకుంది.
విద్యార్థులలో పరిశీలనాసక్తి, అనుకరణ, బోధనలో అభిరుచి, ఉపాధ్యాయుల సాధక బాధకాలు కొంత మేరకు అవగాహన కల్పించుటకు, కార్పోరేట్ పాఠశాలలు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం కద్దు. కానీ కార్పోరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసి పోకుండా, హావ భావాలు, అనుకరణే కాదు అంతకు మించి ఆచార్యులుగా పాఠాలు చెప్పటమే కాదు, రోజంతా పాఠశాల నిర్వహణ, కార్యాలయ నిర్వహణ చేసి వారు ఆనందించడమే కాదు, వారి తల్లిదండ్రులను, ఆచార్యులను, మా పిల్లల్లో ఇంత ప్రతిభ ఉందా అని అచ్చెరు వొందేలా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు తరుచుగా నిర్వహించి విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.






