
భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ విశిష్ట తగా నూజివీడు శ్రీల లితా పీఠం అధిపతి ఆదిత్యానంద భారతీ స్వామి అన్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల కార్యక్రమాల్లో భాగంగా కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ వీధి వాసవీ బస్తీలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. స్వామి మాట్లాడుతూ అన్నింటా, అందరిలో దైవత్వాన్ని చూడడమే హిందూ ధర్మం ప్రత్యేకతని చెప్పారు. ఆర్ ఎస్ఎస్ మహానగర్ సహ కార్యవాహ మారెళ్ల గౌరీ శంకర్, చిరుమామిళ్ల రమేష్, శనగపల్లి మల్లికార్జున, పెరుమాళ్ల మంగా భవానీ, హిమ బిందు తదితరులు పాల్గొన్నారు.
గురునానక్ కాలనీ రామ మందిరంలో నిర్వహించిన సమ్మేళనంలో ఇస్కాన్ విజయవాడ అధ్యక్షుడు చక్ర ధారి దాస్ ప్రభూజీ, విజయవాడ మహానగర్ ప్రచారక్ హనుమంతు మాట్లాడుతూ… హిందూ గ్రంథాలు నిజమైన చారిత్రక సంఘట నలపై ఆధారపడి ఉన్నాయని, నేటికీ అర్థవం తమైన జీవితం గడపడానికి ప్రేరణ, మార్గదర్శ కత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు. పెద్దలు ఎం.సి. దాస్, ఓం ప్రకాష్ జీ అగర్వాల్, బాలకృ ష్ణన్ భరాదియా, దీపక్ బూబ్నా, అజిత్ అగ ర్వాల్, సునీల్ కుమార్ గుప్తా, ఎం.సాయి బాబు తదితరులు పాల్గొన్నారు.





