
తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో సుమారు 3వేల మంది పోలీస్ అధికారులతో బందోబస్తు ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. ముఖ్యప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎ లక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేసిన ట్లు చెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు న కిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమ తి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నా రు. ఈ ఏడాది 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయం, నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే హాజరు కావాలన్నారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలన్నా రు. అదనపు ఎస్పీలు విమనోహరాచారి, శ్రీనివాసులు పాల్గొన్నారు.





