News

పాట్నాలో సరస్వతీ దేవి ఊరేగింపుపై జిహాదీల దాడి

1.9kviews

హిందూ విశ్వాసాలపై ముస్లిముల అసహనం మరోసారి వెల్లడైంది. జీహాదీలు కొందరు వసంత పంచమి సందర్భంగా పాట్నా నగరంలోని అశోక్ రాజ్‌పథ్ ప్రాంతంలో జరుగుతున్న సరస్వతీ దేవి ఊరేగింపుపై దాడి చేశారు.

దాడి వీడియోను విశ్వ హిందూ పరిషత్ ట్వీట్ చేసింది. ముందస్తు వ్యూహం మేరకు జరిగిన దాడి రెండు గంటలకు పైగా కొనసాగిందని వీహెచ్‌పీ వర్గాలు చెబుతున్నాయి. జిహాదీల దాడిలో ఊరేగింపులో పాల్గొన్న అనేక మంది గాయపడ్డారు. కొంత మంది పోలీసులు కూడా గాయాల పాలవడం గమనార్హం.

జాగ్రాన్ మీడియా నివేదిక కూడా వీహెచ్‌పీ వాదనలను ధృవీకరించేలా ఉంది. దాని ప్రకారం సరస్వతి ఊరేగింపుపై బాంబులు, బుల్లెట్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఊరేగింపు వసంత పంచమి సందర్భంగా ప్రతి ఏడూ నిర్వహించేదే అయినా, హిందువుల వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా కేవలం ఊరేగింపును ఆపడం, హిందూ సాంప్రదాయాలను అగౌరవ పరచే ఉద్దేశ్యంతోనే ఇలా దాడి చేశారని  VHP ఆరోపిస్తోంది.

తమపై, తమ విశ్వాసాలపై జరుగుతున్న అకారణ దాడులను హిందువులు ఇంకా ఎంతకాలం భరించాలని వీహెచ్‌పీ ప్రశ్నిస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

లోహర్‌దగాలో జరిగిన సిఎఎ మద్దతు ర్యాలీపై జిహాదీలు చేసిన హింసాత్మక దాడిలో నీరజ్ రామ్ ప్రజాపతి అనే వ్యక్తి మరణించగా, ఇంకా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసినదే.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.