News

తిరుప్పరంకుండ్రంలో ముస్లిం పండుగకు అనుమతా? హిందూ మున్నాని

176views

అత్యంత పవిత్రమైన తిరుప్పరంకుండ్రంలో ముస్లింల పండుగకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హిందూ మున్నాని తీవ్రంగా మండిపడింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుప్పరంకుండ్రంలో దీపాన్నివెలిగించడానికి అనుమతిని నిరాకరించడంతో పూర్ణ చంద్రన్ అనే భక్తుడు తీవ్ర ఆవేదన చెంది, బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే హిందూ మున్నాని కార్యకర్తలు తమిళనాడు అంతటా వివిధ దేవాలయాల్లో హిందూ మున్నాని ‘‘మోక్ష దీపాలు’’ వెలగించింది. అయితే.. ఇంతటి శాంతియుత కార్యక్రమానికి కూడా పోలీసులు అడ్డంకులు సృష్టించారని, తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని మండిపడింది.

హిందూ మున్నాని రాష్ట్ర అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, కొండపై ఉన్న దర్గాలో ముస్లింలు గంధపు పండుగను నిర్వహించడానికి అనుమతిస్తూ డిఎంకె కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని మండిపడ్డారు. ఇలాంటి అనుమతుల ద్వారా ప్రశాంత వాతావరణం చెడిపోదా? అంటూ డీఎంకే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

పూర్ణచంద్రన్ మరణం నిరంతర మానసిక ఒత్తిడి ఫలితమని కాదేశ్వరు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మోక్ష దీపం వెలిగించే కార్యక్రమం అత్యంత ప్రశాంతమైన కార్యక్రమం అని, రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కు అని అన్నారు.చెన్నైలో, మోక్ష దీపం వెలిగించిన హిందూ మున్నాని కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారని, కొన్ని చోట్ల అనుమతులు కూడా నిరాకరించారని మండిపడ్డారు.