News

బిర్సా ముండా పోస్టర్ల ప్రదర్శన.. పుణెలో గిన్నిస్‌ రికార్డు

190views

మహారాష్ట్రలోని పుణెలో ఫెర్గూసన్‌ కళాశాలలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అతిపెద్ద పోస్టర్ల ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నమోదైనట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయ నిర్ణేత స్వప్నిల్‌ డాంగ్రికర్‌ శనివారం ప్రకటించారు. గిరిజన పదాలతో కూడిన 1,678 పోస్టర్లను ఈ ఎగ్జిబిషనులో ప్రదర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో ప్రదర్శించిన 1,365 పోస్టర్ల రికార్డును పుణె ప్రదర్శన అధిగమించినట్లు నిర్వాహకులు తెలిపారు. గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవితం, చేసిన సేవలను ఈ ప్రత్యేక ప్రదర్శన ద్వారా వివరించామని.. సాధించిన రికార్డు ఆయన స్మృతికి నివాళి అని పేర్కొన్నారు. నేషనల్‌ బుక్‌ ట్రస్టు (ఎన్‌బీటీ) ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శన డిసెంబరు 21 వరకు కొనసాగనుంది.