News

ప్రతి విద్యార్థికి జీవితానికి అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం

124views

కృష్ణాజిల్లాలోని కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం బాలికల వసతి గృహంలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపి ప్రెసిడెంట్ ఝాన్సీ మాట్లాడుతూ,రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ గారి పాత్ర ఆనాడు ఆయన చేసిన కృషి ప్రతి విద్యార్థికి జీవితానికి అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం అని తెలిపారు. విద్య, పట్టుదల, సామాజిక న్యాయం కోసం పోరాటం, మరియు సమానత్వం కోసం చేసిన కృషి విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, అడ్డంకులను అధిగమించడానికి, మరియు సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణనిస్తాయన్నారు. అలాగే నేటి విద్యార్థులు సమాజంలో ప్రాథమిక హక్కుల గురించే కాకుండా ప్రాథమిక విధులను సక్రమంగా నిర్వహించగలిగే విద్యార్థులు సమాజంలో తయారు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.