News

వెలుగులోకి రెడ్డిరాజుల శాసనాలు

173views

శిలా శాసనాల పరిరక్షణ, అధ్యయనం, ప్రాముఖ్యంపై భారత పురావస్తు సర్వేక్షణ శాఖ (ఏఎస్‌ఐ) ప్రజల్లో అవగాహన కల్పించడం సత్ఫలితాలనిస్తోంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్‌కు పూర్వీకుల నుంచి వచ్చిన రాగి శాసనాలు ఇటీవల వెలుగుచూశాయి. కొండవీడు కేంద్రంగా పాలించిన రెడ్డిరాజుల కాలంలో దాదాపు శక సంవత్సరం 1330లో ఇతని పూర్వీకులు వేదపండితులుగా పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన సూర్యగ్రహణం (క్రీ.శ 1408, అక్టోబరు 19, శుక్రవారం) సందర్భంగా అప్పటి రాజు పెద్దవేమారెడ్డి తన భార్యతో కలిసి బ్రాహ్మణులకు దానాలు చేశారు. ఆ సందర్భంగా తన ఆస్థానంలో వేదం, సర్ప శాస్త్రం, వేదాంగం, అష్టాంగ ఆయుర్వేదంలో నిపుణులైన సింగనార్య(ఇతడి తండ్రి వీరయార్య, తాత భాస్కరార్యుడు)కు చిన్న గ్రామంగా ఉన్న పొన్నపల్లిని అగ్రహారంగా చేసుకుని వేదపారాయణంతో ధర్మాన్ని వికసింపజేయాలని కోరుతూ దానం చేశారు. దానపత్రాలను సంస్కృత, తెలుగు లిపిలో శ్రీనాథ కవిసార్వభౌముడితో రాగి రేగులపై రాయించి అందించారు.


రెడ్డిరాజులు అందించిన ఈ పొన్నపల్లి అప్పట్లో కుగ్రామం. శాసనాల ప్రకారం ఇది కృష్ణా నదికి ఆవల దివిసీమ ప్రాంతం, ఈవల వెలనాడు అంటే నేటి భట్టిప్రోలు ప్రాంతానికి దగ్గర్లో ఉన్నట్లు రాసి ఉంది. దానంగా వచ్చిన అగ్రహారం కింద సింగనార్యకు దాదాపు 1700 ఎకరాల భూమిని రాజు అందించారు. ఈ నేలపైనే నేటి పొన్నపల్లి గ్రామం విస్తరించింది. ఈ ఏడాది జనవరిలో పొన్నపల్లి శివాలయం వద్ద శాసన గ్రహీతల్లో 22వ తరానికి చెందిన పొన్నపల్లి విద్యాభాస్కర్‌ తమ ఇంటి పూజ గదిలో భద్రపరిచిన ఈ రాగి శాసనాలను తొలిసారి ప్రపంచానికి చూపారు. త్వరలో వీటిని అధ్యయనానికి భారత పురావస్తు శాఖకు అందించనున్నామన్నారు. 


అధ్యయనం చేస్తాం
విద్యాభాస్కర్‌ తమను ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించగా శాసనాలను పరిశీలించాం. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌ వచ్చి ఆయన నివాసంలో ఉన్న రాగి శాసనాలను పరిశీలించి అధ్యయనం కోసం వాటిని తీసుకెళతామని కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఏఎస్‌ఐ డైరెక్టర్‌ కె.మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనాల్లో లిపి ఆధారంగా కొంత సమాచారాన్ని ఇప్పటికే అతనికి తెలిపాం. పూర్తిగా పరిశోధించి డీకోడ్‌ చేసిన తరువాత అందులో ఏముందో తెలియజేస్తామన్నారు. ఏవైనా శాసనాల గురించి ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్నా మైసూరులోని పురావస్తు సర్వేక్షణ శాఖ