
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈరోజు చెన్నై చేరుకున్నారు. నేడు కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవన ప్రస్థానంలోని వివిధ ఛాయాచిత్రాలు, కంచి కామకోటి పీఠం కార్యకలాపాలకు చెందిన ఛాయాచిత్రాల సమాహారంగా ఏర్పాటు చేయబడిన ‘ అనుగ్రహ వర్ష’ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.

అలాగే కంచి పరమాచార్య వివిధ సందర్భాలలో భక్తులను ఉద్దేశించి హిందూ ధర్మంపై చేసిన వివిధ ప్రసంగాల సంకలనం “దేవతిన్ కురల్” యొక్క హిందీ అనువాదమైన “పరమ్ వాణి” అనే గ్రంథాన్ని కూడా శ్రీ మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. ఈ సభలో ప్రస్తుత కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి తోపాటు అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు.

రేపు జరగబోయే ఒక కార్యక్రమంలో శ్రీ మోహన్ భాగవత్ జలవనరుల పరిరక్షణ ఆవశ్యకతపై ప్రసంగించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేపట్టబోయే వివిధ కార్యక్రమాల పై కూడా చర్చించనున్నట్లుగా సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





