ArticlesNews

లక్నోలో ఒకేచోట గిరిజనుల 38 కళల సంగమం.. ప్రపంచంలోనే ఏకైక వేదిక.. 

200views

 

ప్రతి సంవత్సరం నవంబర్ 15న దేశం మొత్తం జనజాతి గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. గిరిజనుల గొప్ప చరిత్ర, సంస్కృతి మరియు స్వాతంత్య్ర పోరాటంలో వారి అద్భుతమైన పాత్రను గౌరవించడం కోసం ఈ రోజును కేటాయించారు. భారత ప్రభుత్వం 2021లో, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి రోజున, ఈ ‘జనజాతీ గౌరవ్ దివస్’ వేడుకను మొదలుపెట్టింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం (2024లో) ‘అంతర్జాతీయ గిరిజన భాగస్వామ్య ఉత్సవం’ (International Tribal Exchange Festival)ను నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 15 నుండి 20 వరకు (6 రోజులు) లక్నోలో జరుగుతుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఈ ఉత్సవం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇందులో కేవలం భారతదేశంలోని 22 రాష్ట్రాల గిరిజనులే కాకుండా.. స్లోవేకియా మరియు వియత్నాం వంటి దేశాల గిరిజన ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ప్రపంచంలో ఇలాంటి ఉత్సవం జరుగుతున్న ఏకైక వేదిక ఇది.

ఇక్కడ, ఒకేచోట భారతదేశం నుంచీ అంతర్జాతీయ స్థాయి వరకూ ఉన్న గిరిజన సంప్రదాయాలు, కళలు, చేతిపనులు, పాటలు, నృత్యాలు, దుస్తులు, సాహిత్యం మరియు మతపరమైన పద్ధతులను దగ్గరగా చూడొచ్చు. ఈ ఉత్సవంలో సాంప్రదాయిక గిరిజనులే కాకుండా, నటులు, బంజారా సమూహాలు, వేషాలు మార్చే బహురూపియాలు, భపంగ్ వాయిద్యకారులు మరియు తోలుబొమ్మలాట కళాకారులు కూడా తమ కళలను ప్రదర్శిస్తారు.

 

భారతదేశంలో గిరిజన సమాజ జనాభా 10.45 కోట్లు. అంటే మొత్తం జనాభాలో 8.6% అన్నమాట. కాగా.. యూపీలో గిరిజన సమాజ జనాభా 11,34,273 ఉంది. గిరిజన సమాజాన్ని సమాజంలోని ప్రధాన స్రవంతిలో కలపడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం అంటే 2024లో అంతర్జాతీయ గిరిజన భాగస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. ఈ ఉత్సవం భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15న ప్రారంభమై నవంబర్ 20 వరకు జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో భారతదేశంలోని 22 రాష్ట్రాల నుండి గిరిజన సమాజ కళాకారులు, శిల్పకారులు పాల్గొంటారు. వారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తమ హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా 38 జానపద కళలు ప్రదర్శించబడతాయి.

ప్రదర్శించబడే 38 జానపద కళల్లో

ఉత్తరప్రదేశ్ : డోమకచ్, ఝీఝీ, జవారా, నగమతియా మరియు చంగేలీ నృత్యాలు

బీహార్ : ఉరావ్

ఉత్తరాఖండ్ : ఝైంతా

మధ్యప్రదేశ్ : భగోరియా, బైగా, రమ్‌ధోలా

పశ్చిమ బెంగాల్ : నటువా

మిజోరాం : చెరావ్

అరుణాచల్ ప్రదేశ్ : అకా

పంజాబ్ : షమ్మీ

కేరళ : ఇరులా

ఛత్తీస్‌గఢ్ : గండి, భుంజియా, మాటి మాంద్రి నృత్యం

హిమాచల్ ప్రదేశ్ : సిరమౌరి నాటి

రాజస్థాన్ : కాళ్వేలియా, లంగా, మాగ్‌ఝియార్ మరియు తేరాతాలీ

అస్సాం : బర్దోయి, శిఖ్లా, త్రిపుర నుండి హౌజాగిరి

జార్ఖండ్ : ఖడియా

గోవా : కున్బీ

గుజరాత్ : సిద్ధి ధమాల్

జమ్మూ-కాశ్మీర్ : మోంగో (బకర్వాల్)

సిక్కిం : సింఘీ ఛమ్

మహారాష్ట్ర : సాంఘీ ముఖౌటా

ఒడిశా : ఘుడ్కా

కర్ణాటక : ఫుగడి

వంటి జానపద నృత్యాలు ప్రదర్శించబడతాయి.

 

ఈ ఉత్సవంలో గిరిజన సమాజం తయారుచేసిన హస్తకళా ఉత్పత్తులు, గిరిజన ఆహారం మరియు వంటకాల ప్రదర్శన, గిరిజన పండుగ సంప్రదాయాల ప్రదర్శన, గిరిజన సాహిత్యం, గిరిజన పండుగలు, సాహిత్యానికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి మరియు ప్రదర్శనలు జరుగుతాయి.

 

అంతర్జాతీయ గిరిజన భాగస్వామ్య ఉత్సవం ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 15 నుండి 20 వరకు జరుగుతుంది. దీనిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క లోక్ ఏవం జనజాతియ్ సంస్థాన్ (జానపద మరియు గిరిజన సంస్థ), లక్నో, పర్యాటక విభాగం, గిరిజన అభివృద్ధి విభాగం, సమాజ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సంగీత నాటక కళా అకాడమీ, లక్నో, షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ విభాగం, ఉత్తరప్రదేశ్ పరిశోధన మరియు శిక్షణ సంస్థాన్, లక్నో, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, న్యూఢిల్లీ సహకారంతో నిర్వహిస్తారు.

ఉత్సవంలో ఏర్పాటు చేసే ప్రదర్శనలు

హస్తకళ :

ఉత్సవంలో గిరిజన సమాజ ప్రజలు తయారుచేసిన ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఇందులో వెదురుతో చేసిన బుట్టలు, టోపీలు, గిఫ్ట్ బాక్సులు, అలంకరణ వస్తువులు మరియు బెత్తం, వనమూలికలు, గిరిజన చిత్రలేఖనం, లోహపు కళాఖండాలు (ఢోలా-మారు కళ, బస్తర్ ధోక్రా), మట్టి పాత్రలు, దరీ (తివాచీలు), చెక్క బొమ్మలు, ఆభరణాలు మరియు చేతితో నేసిన వస్త్రాలను 100కు పైగా స్టాల్స్‌లో అమ్మకానికి ఉంచుతారు.

 

ఆహార సంప్రదాయం:

గిరిజన సమాజం వారి ప్రత్యేక సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇందులో ఆహారం కూడా భాగమే. గిరిజన సమాజం కొడో, మొక్కజొన్న (మక్కా), మండువా (రాగులు), మూలికలు మరియు మహువాతో చేసిన వంటకాలను ఆహారంగా తీసుకుంటారు. ఈ ఉత్సవంలో ఈ గిరిజన వంటకాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేయబడుతుంది.

గిరిజన క్రీడలు:

ఉత్సవంలో గిరిజన క్రీడల ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ క్రీడల్లో విలువిద్య (ఆర్చరీ), కుస్తీ (మల్లయుద్ధం), గిల్లి-దండ, మల్లఖంబ్, కలారిపయట్టు మరియు ఖో-ఖో వంటి క్రీడా పోటీలు నిర్వహించబడతాయి.

గిరిజన సాహిత్యం:

ఉత్సవంలో గిరిజన సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో పుస్తక ప్రదర్శన (పుస్తక మేళా) కూడా ఏర్పాటు చేయబడుతుంది.

మతపరమైన సంప్రదాయాలు:

మతపరమైన సంప్రదాయాల ప్రదర్శనను గిరిజన కళాకారులు చేస్తారు. ఇందులో ప్రకృతి ఆరాధన రూపంలో సూర్యుడు, చంద్రుడు, చెట్లు, పర్వతాలు, అన్న దేవత మరియు వన దేవతను పూజిస్తారు. ఉదాహరణకు, గిరిజన సంప్రదాయంలో గోండ్ సమాజంలో ‘ఫెన్ పెన్’ మరియు సంతాల్ సమాజంలో ‘మరాంగ్ బూరు’ దేవతను పూజిస్తారు.

 

పండుగలు:

ఉత్సవంలో పంట కోతకు సంబంధించిన సర్‌హుల్, కర్మ వంటి పండుగలను, అలాగే వేటకు సంబంధించిన ఆచారాలను కళాకారులు ప్రదర్శిస్తారు. వీటితో పాటు కొన్ని గిరిజన తెగలు టోటెమిక్ సంప్రదాయాన్ని పాటిస్తాయి. దీనిలో ఒక నిర్దిష్ట జంతువు, పక్షి లేదా చెట్టును తమ పూర్వీకునిగా భావించి పూజిస్తారు. వీటన్నింటికి సంబంధించిన సంప్రదాయాలను కూడా కళాకారులు ప్రదర్శిస్తారు.

పోథీఘర్:

ఉత్సవ స్థలంలో ‘పోథీఘర్’ అనే ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ గిరిజన సమాజం యొక్క సాహిత్యం అందుబాటులో ఉంటుంది. ఈ సాహిత్యంలో గిరిజన జానపద కథలు, జానపద గేయాలు, ప్రాచీన గిరిజన జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు అమ్ముడవుతాయి. దీని ద్వారా ప్రజలు గిరిజన సంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు.