
208views
గుండ్లకమ్మ నదిలో శివలింగం, నందీశ్వర విగ్రహాలు బయటపడ్డాయి. పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని తంగిరాల గ్రామ సరిహద్దుగా ప్రవహిస్తున్న నదిలో విగ్రహాలు బయటపడటాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఇక్కడ నది రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వరదల సమయంలో మట్టి మేట వేయడంతో ఏళ్ల తరబడి ఇక్కడ పెద్ద గుట్టలా తయారైంది. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నదికి పోటెత్తిన వరదకు మట్టి గుట్ట మొత్తం కొట్టుకుపోయింది. ప్రసుత్తం ఇక్కడ నీటి ప్రవాహం తగ్గడంతో పురాతన శివలింగం, నందీశ్వరుని విగ్రహాలు బయటపడ్డాయి. కార్తిక మాసంలో శివలింగం బయటపడటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. గతంలో ఇక్కడో శివాలయం ఉండి ఉంటుందని.. కాలక్రమంలో నది ప్రవాహంలో కలిసిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.




