
రామాయణం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి మార్గనిర్దేశం చేస్తుంది. నీతి, నిజాయతీ, కర్తవ్యం, ధర్మం, భక్తి, విశ్వాసం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, సహనం, నాయకత్వ లక్షణాలను బోధించడం ద్వారా విద్యార్థులు ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగడానికి సహాయపడుతుంది. రామాయణాన్ని చదివి, అందులోని పాత్రల లక్షణాలను క్షుణ్నంగా పరిశీలించడం, వాటిలో ఉన్న మంచిని అలపర్చుకోవడం ద్వారా విద్యార్థులకు జీవితంలో ఎదురయ్యే కఠినమైన సవాళ్లను సులభంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. విద్యార్థి వికాసానికి రామాయణం ఎలా తోడ్పడుతుందంటే..
నైతిక విలువలు: రామాయణం సత్యం, న్యాయం, ధర్మం వంటి నైతిక విలువలను బోధిస్తుంది. ఇవి విద్యార్థులు సక్రమ మార్గంలో నడవడానికి పునాది వేస్తాయి.
గౌరవం, వినయ విధేయతలు: పెద్దలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, వినయ విధేయతలతో ప్రవర్తించడం అవలడుతుంది.
ధైర్యం, స్థిరత్వం: రాముడు సీతను రక్షించడానికి అడవుల్లోకి వెళ్ళినప్పుడు చూపిన ధైర్యం, కష్టాలను ఎదుర్కొన్నపుడు ఆయన చూపిన స్థిరత్వం విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయి.
కర్తవ్యం పట్ల నిబద్ధత: తల్లిదండ్రుల పట్ల రాముని కర్తవ్యం, భరతుడికి రాముని పట్ల విధేయత, కర్తవ్య నిష్ఠను నేర్పుతాయి.
సహనం, దయ: వనవాసంలో ఉన్న సమయంలో సీత ఓర్పుతో కష్టాలను సహించడం, రాముడి దయ వంటి గుణాలు విద్యార్థులలో కరుణ, సహనాన్ని పెంపొందిస్తాయి.
నాయకత్వ లక్షణాలు: రామాయణంలోని పాత్రల ద్వారా నాయకత్వ లక్షణాలను, జట్టుగా పని చేయడాన్ని నేర్చుకోవచ్చు.
వీటితో పాటు స్వీయ నియంత్రణ, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం, ఒత్తిడిని సమర్ధంగా ఎదుర్కోగలగడం వంటి సద్గుణాలను విద్యార్థులు పెంపొందించుకోవడానికి రామాయణం సహాయ పడుతుంది