
భారత దేశ ప్రముఖ స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆరెస్సెస్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.దేశాన్ని, సంస్కృతిని పునర్నిర్మించడంలో 100 ఏళ్ల ప్రయాణమని, యువత, జాతీయ భావాలను పెంపొందించడంలో సంస్థ పాత్రను కొనియాడారు.ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భావగవత్ తో ఇటీవల జరిగిన సమావేశం తనపై లోతైన ముద్రను వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్రాస్తూ..
‘‘స్వాతంత్రానికి ముందు దేశానికి ఆత్మలాంటి విషయాలు, ప్రాథమికంగా సంస్కృతిని, ఇక్కడి భావజాలాన్ని కొన్ని సైద్ధాంతిక శక్దులు దోపిడీ చేశాయి. దీంతో మనదైన సంస్కృతిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై తీవ్రంగా ఆందోళన చెందిన నేపథ్యంలోనే ఆరెస్సెస్ పుట్టింది.దేశ పునర్నిర్మాణం, సంస్కృతిని పునరుద్ధరించడం అన్న లక్ష్యంతో డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ 1925 లో సంఘ్ ను స్థాపించారు. నేడు ఈ ప్రయాణం 100ఏళ్లను పూర్తి చేసుకుంది.వ్యక్తి నిర్మాణమే సంఘ్ ప్రథమ లక్ష్యం. నిత్య శాఖ ద్వారా దేశభక్తి, అంకిత భావం కలిగిన యువకులను తయారు చేస్తారు. గత వందేళ్ల కాలంలో సంఘ్ సమాజంలోని ప్రతి రంగంలోనూ పరివర్తన కోసం కృషి చేస్తోంది. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, రాజకీయాలు.. ఇలా ప్రతి రంగంలోనూ సామాజిక మార్పుకు కృషి చేస్తోంది. సంఘ శాఖలో నిర్మాణమైన వ్యక్తులు నేడు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఉదాహరణ. అనేక కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది స్వయంసేవకులు తమ జీవితాలను సమాజ సేవకు అంకితం చేస్తున్నారు. సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో సమావేశం అవ్వడం నా అదృష్టం. దేశ సంస్కృతి లోతు, సమకాలనీ సవాళ్లకు పరిష్కారాలు, లోతైన పోరాట స్ఫూర్తి, అంకిత భావం ఇవన్నీ అందులో ప్రతిబింబించాయి. ఈ అనుభవం సంఘ్ పై గౌరవాన్ని మరింత పెంచాయి. సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా లక్షలాది మంది స్వయంసేవకులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ దేశం పట్ల వారు చూపిస్తున్న అచంలచమైన అంకితభావం, వారు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు’’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.





