
వాళ్లకి సమస్యలు ఉన్నవాళ్లు కావాలి. వారి సమస్యలే వారికి ఒక అవకాశం. ఏ రోగాలో, రొస్టులో ఉన్న వారి దగ్గరకు వెళ్లి వద్దు కుయ్యో మొర్రో అన్నా వినిపించుకోకుండా, మీ మంచి కోసమే, మీ పిల్లల ఆరోగ్యం కోసమే అంటూ ప్రార్థనలు మొదలుపెడతారు. సరే పోనీ ఏదో ఒకటి మన మంచి కోసమేగా చేస్తానంటున్నాడు అని అమాయకంగా ఒప్పుకుంటారు. ఇక జబ్బు నయమయితే అదంతా తమ ప్రార్థనల, తమ దేవుడి ప్రభావమే అంటూ ఆ అమాయకులని ఊదరగొట్టి, నెమ్మదిగా ఆ మాట, ఈ మాట చెప్పి మతం మార్చడం వాళ్ల పని.
ఇది ఆసుపత్రులలో, వివిధ ప్రదేశాలలో ఎప్పటి నుంచో జరుగుతున్నదే అయినా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరింత ఎక్కువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా గుంటూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రి (జిజిహెచ్) లో మత ప్రార్థనలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అక్కడి యంత్రాంగం సైతం చూసీచూడనట్టు వదిలేస్తుండడంతో అన్యమత ప్రచారకులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతున్నదట. “దేవుడు ఉన్నాడు. మీకు స్వస్థత చేకూరుస్తాడు” అంటూ ఏవేవో మాయ మాటలు చెప్పి ప్రార్థనలు చేసి, మీ సంతోషం కొద్దీ ఎంతోకొంత ఇవ్వమంటూ డబ్బులు తీసుకుంటున్నారని రోగులు ఆవేదన చెందుతున్నారు. మాకు వద్దని చెబుతున్నా వినకుండా మీకోసమేనంటూ మొహమాట పెట్టి, బలవంతంగా ప్రార్థనలు చేస్తున్నారని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. కొందరు ఇష్టపూర్వకంగా నే చేయించుకుంటూ ఉన్నా, మరికొందరు మాత్రం అయిష్టంగానైనా చేయించుకోక తప్పడం లేదని అంటున్నారు.
ఐదేళ్ల క్రితం ఇదేవిధంగా మత బోధకులు వచ్చి ఆసుపత్రిలో ప్రార్థనలు చేయడంతో పెద్ద రభస అయింది. ఈ రోజు నుంచి ఆస్పత్రిలో ఈ తరహా కార్యకలాపాలు నిలిచిపోయినా తాజాగా మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆసుపత్రికి 190 మంది వరకూ భద్రతా సిబ్బంది అవసరం ఉండగా కేవలం వందమందే ఉండడంతో వారు ఈ అన్యమత ప్రచారకుల రాకపోకలపై తగినంత నిఘా పెట్టలేక పోతున్నారనే వాదం వినిపిస్తోంది.గతంలో ఈ ఆసుపత్రిలో శిశువులను కూడా అపహరించుకు పోయిన సంఘటనలు జరిగి ఉన్నాయి. కనుక ఆసుపత్రిలోకి వచ్చేపోయే వారి పై తగిన నిఘా అవసరం.
గట్టి చర్యలు తీసుకుంటాం – ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య బాబూలాల్.
ఆసుపత్రి వార్డులలోకి అన్య మత ప్రచారకులు వచ్చి ప్రార్థనలు చేసుకున్న విషయం తన దృష్టికి ఇంకా రాలేదని, ఆసుపత్రిలో అలాంటి వాటికి స్థానం లేదని, దీనిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య బాబూలాల్ తెలిపారు. ఆసుపత్రి భద్రతా సిబ్బంది తగు జాగ్రత్త వహించాలని, వారిని ఆసుపత్రిలోకి అనుమతించరాదని ఆయన అన్నారు. ఒకవేళ వారు వినిపించుకోక పోతే ఆసుపత్రి పరిపాలనా వ్యవహారారాలను పర్యవేక్షించే RMO కి ఫిర్యాదు చెయ్యల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తామని కూడా ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





