
ఐ లవ్ మహాదేవ్” అని పోస్ట్ చేసినందుకు ముస్లిం యువకులు రిషికేశ్‌లో ఓ హిందూ కార్యకర్తను కొట్టి చంపేస్తామని బెదిరించారు. వివరాల్లోకి వెళితే రిషికేశ్‌లోని గోవింద్ నగర్ నివాసి , హిందూ రక్షా దళ్ మీడియా ఇన్‌చార్జ్ అయిన వికాస్ కశ్యప్ తన సోషల్ మీడియా ఖాతాలో “నేను మహదేవ్‌ను ప్రేమిస్తున్నాను” అని ఒక పోస్ట్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత, ఆ పోస్ట్‌పై అతనికి బెదిరింపులు , అసభ్యకరమైన మెసేజ్ లు వచ్చాయి. ఇది జరిగిన కొద్దిసేపటికే అజం ఖాన్ అనే వ్యక్తి తన 15 మంది సహచరులతో కలిసి అతని వద్దకు వచ్చి అతనిపై దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. వికాస్ సహచరులు వచ్చే సమయానికి, నిందితులు రెండు వాహనాల్లో పారిపోయారు.
ఈ విషయంపై హిందూత్వ సంస్థల కార్యకర్తలు రిషికేశ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గొడవ చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, నిందితులపై కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని రిషికేశ్ పోలిస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ రాణా తెలిపారు.
రిషికేశ్ అనేది ఒక సనాతన నగరమే కాకుండా, యోగా పరంగా చాలా ప్రాముఖ్యత పొందిన నగరం. ఇక్కడ బయటి నుండి వచ్చిన ముస్లింలు చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రభుత్వ ఆస్తులలో అక్రమంగా స్థిరపడ్డారు. అక్కడే ఉన్న ఐడిపిఎల్‌కు చెందిన ప్రభుత్వ భూమిని ముస్లింలు అక్రమంగా ఆక్రమించుకున్నట్లు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై సమగ్ర పోలీసు దర్యాప్తు చేయాలని హిందూత్వ సంస్థలు డిమాండ్ చేశాయి.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, యోగా నగరమైన రిషికేశ్ లో
యోగా నగరమైన రిషికేశ్‌లో నగరంలో అశాంతి మొదలైంది. సోషల్ మీడియాలో “ఐ లవ్ మహాదేవ్” అనే నినాదాన్ని పోస్ట్ చేసినందుకు ముస్లిం యువకులు ఒక హిందూత్వ కార్యకర్తపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారు.
మహాదేవ్ కు సంబంధించిన పోస్ట్ పై ఇస్లాంవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషికేశ్‌లోని గోవింద్ నగర్ నివాసి మరియు హిందూ రక్షా దళ్ మీడియా ఇన్‌చార్జ్ అయిన వికాస్ కశ్యప్ తన సోషల్ మీడియా ఖాతాలో “నేను మహదేవ్‌ను ప్రేమిస్తున్నాను” అని ఒక పోస్ట్ పోస్ట్ చేశాడని నివేదికలు చెబుతున్నాయి.




