News

సనాతన జీవన విధాన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం

360views

ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఆయుర్ విభాగం, స్థానిక భగీరథ సదన్ లో ఉచిత ఆయుర్వేద వైద్యం శిబిరాన్ని నిర్వహించారు‌.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డా: జి.రామకృష్ణా రెడ్డి, శ్రీ పబ్బతి వేణుగోపాల్ గార్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో శిబిరాన్ని ప్రారంభం చేశారు.

ముఖ్య వక్త విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సేవా విభాగం ప్రముఖ్ డా: పోలూరు రామ్మూర్తి గారు మాట్లాడుతూ, సనాతన జీవన విధాన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదమని ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు.

వైద్యం శిబిరంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జిల్లా ఆయుర్ విభాగం అధికారి డా: యశోధర, డా:చిట్టిబొట్ల భరద్వాజ శర్మ , డా: మధుసూదన శర్మ, డా: అలిభాష, డా: ఐ.వి సుబ్రహ్మణ్యం, డా. శ్రీలక్ష్మి, డా: బి. వెంకట కృష్ణ, డా: ఈశ్వర్, డా: చందన, డా: శ్రావణ సంధ్య, డా: సురేష్ బాబు తదితరులు పాల్గొని తమ సేవలందించారు.

విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ చంద్ర మౌళీశ్వర రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి , శ్రీ వై.ఎన్ రెడ్డి ,శ్రీ పోలేపల్లి సందీప్, శ్రీ గోళ్ల సుదర్శనం, శ్రీ మదుసూదన రావు, జిల్లా సేవా ప్రముఖ్ శ్రీ శీలంమోహన్ కిరణ్ , విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు శ్రీమతి సుహాసిని,శ్రీ చంద్ర శేఖర్,శ్రీ శేష సాయి, శ్రీ శ్రీకాంత్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ శిబిరంలో సుమారు 180 మంది నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలపై వైద్యుల నుండి తగు సూచనలతో పాటు ఉచిత మందులు కూడా పొందారు.