
583views
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై ఫేస్బుక్లో అనుచిత, అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం నల్లగుట్టకు చెందిన కే. జైనుల్లా (34) ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ పోలీసులను అసభ్య పదజాలంతో నిందిస్తూ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఈ పోస్ట్ పై బిజెపి మండల అధ్యక్షురాలు లక్ష్మీకాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి జైనుల్లాను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





