
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హైదరాబాద్ బడంగ్‌పేట బస్తీ విజయదశమి ఉత్సవం తిరుమల గార్డెన్స్‌లో జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా DRDO సైంటిస్ట్ డా. జగన్నాథ నాయక్ హాజరయ్యారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ జగన్నాథ్ నాయక్ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ కాలంలో దుర్గామాతనే భారతమాతకు ప్రతీకగా పూజించేవారని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మానవులు ఎంతో ఉన్నతిని సాధించవచ్చంటూ తాను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోదామనుకున్న సమయంలో తాను విదేశాలకు గాక స్వదేశంలోనే సేవ చెయ్యాలని తన తల్లి కోరుకున్నారని చెప్పారు. తన తల్లి చేసిన పూజలనే దైవం ఆలకించి తనను ఆపడం వల్లనే మాతృభూమి అయిన భారతమాతకు సేవ చేసుకునే భాగ్యం దక్కిందన్నారు.
విదేశాలపై ఆధారపడకుండా మన దేశంలోనే క్షిపణుల్లో ఉపయోగించే జైరోస్కోప్‌ను డిఆర్‌డిఓలో తయారు చేసుకున్నామని వివరిస్తూ ఆత్మవిశ్వాసం వల్లనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఉద్యోగ విధుల్లో భాగంగా అర్ధరాత్రి వరకూ పనిచేసేవాడిని, ఈ క్రమంలో శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు తమ ఆత్మీయ సహచరుని సూచనతో యోగా, ధ్యానం చేసి ఎంతో ప్రయోజనం పొందానని, అప్పటి వరకూ యోగా, ధ్యానం పట్ల తనకు నమ్మకం ఉండేది కాదని డాక్టర్ జగన్నాథ్ వివరించారు. “ఆత్మ నిర్బర్ భారత్” గురించి స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్‌లో మన స్వదేశీ పరిజ్ఞానంతో ఎలా శత్రుసైన్యాలను మట్టికరిపించిందీ తెలియజేశారు.
వక్తగా విచ్చేసిన సునీల్ అంబేకర్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి అయిందని, ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది జరుగుతున్న సమయంలో సంఘం 100 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నప్పటికీ RSS దేశ ప్రజల సంస్కృతి సంరక్షణ కోసం నిలబడిందన్నారు.
దేశం ‘ఆత్మ నిర్బర్’ వైపుకు వెళ్తోదని, దానికై శక్తి సాధన చేయాలని తెలిపారు. దీంట్లో స్వయం సేవకుల పాత్ర ఎంతో ఉంటుందని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమాజంలో నిరంతరం పనిచేస్తూ పంచ పరివర్తనతో ఈ సమాజం మార్పు కోసం పని చేస్తుందన్నారు. సామజిక సమరసత, పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, నాఅనేక శిష్టాచారాలు అనే ఐదు అంశాలపై చర్చించారు. వ్యక్తి వ్యక్తి కలవడం, సమాజం సంఘటితం అవ్వాలి అని ఆకాక్షించారు.రామ బాణంలా అందరు కలిసికట్టుగా, ఈ సమాజం లో ఉన్న దుష్టశక్తులను ఎదురుకోవాలని తెలిపారు. విజ్ఞానం ఎంతో పెరుగుతుందని, AI ను దేశ ప్రయోజనాలకు వాడుకోవాలని తెలిపారు.





