
బంగ్లాదేశ్ లో దుర్గా వేడుకలు చేసుకునేందుకు కూడా హిందువులకు వీలులేకుండా పోతుంది. అక్కడ 700కి పైగా దుర్గా మండపాలు దీనస్థితిలో ఉన్నాయట..ఈ విషయాన్నిస్వయంగా బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతన జాగరణ్ జోట్ చెప్పిం. హిందూ సమాజానికి చెందిన నాయకుల కూటమి అయిన బంగ్లాదేశ్ సమ్మిలిత సనాతని జాగరణ్ జోట్, దేశవ్యాప్తంగా 700 కి పైగా దుర్గా పూజ మండపాలు దుర్బలంగా ఉన్నాయని గుర్తించింది. ఈ విషయాన్ని నిన్న ఢాకా రిపోర్టర్స్ యూనిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు తెలిపారు. వాటిలో, సత్ఖిరా 55 మండపాలు ప్రమాదకరమైనవిగా గుర్తించబడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని, వాటిల్లో కుమిల్లా, చటోగ్రామ్, గాజీపూర్, మైమెన్సింగ్ , రాజ్‌షాహిలోని ఇతర మండపాలు ఉన్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కూటమి ఇప్పటికే ప్రభుత్వానికి జాబితాలను సమర్పించింది.అలాగే మండపాల వద్ద భద్రతను ఇవ్వాలని చెబుతూ అన్ని మండపాల వద్ద సైన్యాన్ని మోహరించి సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సందర్భంగా “సైన్యం ఇప్పటికే శాంతిభద్రతలను కాపాడటంలో పౌర పరిపాలనకు సహాయం చేస్తున్నందున, పూజ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, వేడుకలను శాంతియుతంగా చేసుకునేలాగా సైన్యం భద్రతను కల్పించాలంటూ..అని కూటమి ప్రతినిధి ప్రదీప్ కాంతి డే అన్నారు. మరో ప్రతినిధి ప్రోసేన్‌జిత్ కుమార్ హాల్డర్, మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఎనిమిది అంశాల డిమాండ్‌ను వివరిస్తూ లిఖిత ప్రకటనను సమర్పించారు.





