
శబరిమల రక్షణ సంఘంలో ‘వావర్’ అనే వ్యక్తిని ఇస్లామిక్ ఆక్రమణదారుడిగా అభివర్ణించిన వ్యాఖ్యలపై శాంతానంద మహర్షి కేసు నమోదు చేసి,పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు ముందుగా వావర్ ని దర్శనం చేసుకుని తర్వాత అయ్యప్ప ను దర్శనం చేసుకుంటుంటారు. అయితే ఈ వావర్ ఉండే మసీదును తిరిగి నిర్మించాలని ప్రతిపాదన ఉంది. అయితే దీనిపై శాంతానంద మహర్షి స్పందించారు. వావర్ అనే వ్యక్తి ముస్లిం దురాక్రమణ దారుడు అని, అయ్యప్పను ఓడించడానికి వచ్చిన ఉస్లామిక్ ఉగ్రవాది అని అతన్ని అయ్యప్ప భక్తునిగా చూపించడం అనేది ఇటీవలనే ప్రవేశపెట్టిన చారిత్రక వ్యక్తీకరణ అని ఆయన అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విధంగా భగవాన్ శివుని ప్రతిరూపకంగా, అయ్యప్ప మూర్తి రక్షకుడిగ వర్ణించబడిన వపుర అనే భక్తుడిని మనం గౌరవించాలని, వావర్ ను కాదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఇటీవల శబరిమల కర్మ సమితి భగవాన్ అయ్యప్ప జన్మస్థలమైన పండలంలో నిర్వహించిన శబరిమల రక్షణ సంగమంలో చేశారు. దేవస్వం బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా కేరళ ప్రభుత్వం , ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు పంపా నది ఒడ్డున ‘గ్లోబల్ అయ్యప్ప సంగమం’ నిర్వహించిన వెంటనే ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో వపుర స్వామి’ ఆలయంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి అయ్యప్ప మూర్తిని పూజించే అవకాశం ఉండాలని మహర్షి అన్నారు. ఈ ప్రయోజనం కోసం ఎరుమేలిలో ‘వపుర స్వామి’ ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ‘వపుర’ అయ్యప్ప మూర్తిని రక్షిస్తుందనే పాత నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వావర్ అనే వ్యక్తి చారిత్రక వ్యక్తీకరణ అని పేర్కొన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు శబరిమల తీర్థయాత్ర ప్రాంతంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని , మత సామరస్యాన్ని బెదిరించేలా ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహర్షి ప్రసంగంలోని పూర్తి కంటెంట్‌ను సమీక్షించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పండలం పోలీసులు తెలిపారు.





