News

గోవులను వధించి నూనె తయారు చేస్తున్న ముస్లింలు అరెస్ట్‌

199views

కాకినాడ జిల్లా తునిలో దారుణం వెలుగుచూసింది. పవిత్రమైన గోవులను వధించే ముఠా గుట్టురట్టు అయింది. తుని కేంద్రంగా కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తుని సీఐ గీతా రామకృష్ణ బృందం పట్టణ శివారు రామకృష్ణా కాలనీలో ఆకస్మిక దాడులు చేశారు. అదే ప్రాంతంలో తాండవ నదీ తీరాన ఆ నుకుని ఒక ఇంట్లో గోవులను దాచిపెట్టి వధించి ఆయిల్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. గో మాంసంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఐ గీతారామకృష్ణ మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో 2023లో గో మాంసం ఆయిల్‌ తయారీపై దాడి చేయగా ఇదే రీతిన గో మాంసం, ఆయిల్‌ పట్టుబడిందని కేసు నమోదు చేశామన్నారు. అదే వ్యక్తులు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తెలిసిందన్నారు. స్థానిక వీఆర్వో, వెటర్నరీ డిపార్టుమెంట్‌తో కలిసి దాడులు చేశా మని.. 8 టిన్నుల్లో గో మాంసం నుంచి తీసిన నూనెలు, గో మాం సం సీఐ పట్టుపడిందని తెలిపారు. మహ్మద్‌ సంసరే, మహ్మద్‌ హరీఫ్‌, మహ్మర్‌ ఇరీస్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.