
దేశరాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు పాల్పడిన కొందరు వ్యక్తుల్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్డులతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి చేసిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై కేసు నమోదు చేసుకొని దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమైన పోలీసులు.. ఇప్పటికే కొందరిని గుర్తించామని వెల్లడించారు. అయితే, ఇప్పటిదాకా ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై దిల్లీ పోలీస్ చీఫ్‌తో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తోనూ మాట్లాడిన ఆయన.. యూనివర్సిటీ ప్రతినిధులతో టచ్‌లో ఉండాలని సూచించారు. అయితే, వర్సిటీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది మాత్రం ఈ ఘటనపై పోలీసులు, ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపిస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





