News

యునెస్కో తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు

264views

రాష్ట్రంలోని రెండు ప్రఖ్యాత సహజ సంపదలకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కే అవకాశం ఏర్పడింది. తిరుమల కొండలు, విశాఖ పట్నంలోని ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే ప్రపంచ వారసత్వ హోదా పొందడంలో మొదటి, కీలకమైన అడుగుగా భావిస్తారు.

భారత్ నుంచి మొత్తం ఏడు సహజ వారసత్వ ప్రదేశాలను యునెస్కో తన తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి బృందం ‘ఎక్స్’ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రదేశాలతో పాటు, మహారాష్ట్రలోని పాంచని-మహాబలేశ్వర్‌లోని డెక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని ఉడుపిలోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్, మేఘాలయలోని మేఘాలయన్ ఏజ్ గుహలు ఉన్నాయి. అలాగే, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కాల క్లిఫ్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయని అధికారులు తెలిపారు