
మధ్యప్రదేశ్ లోని బుర్ఖాన్ పూర్ లో ని బిరోడా గ్రామంలో శాంతియుతంగా గణేశ్ నిమర్జన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న హిందువులపై ముస్లిం మూక రాళ్లతో దాడి చేశారు. , బిరోడాలోని అన్ని గణేష్ విగ్రహాలను ముందుగానే నిమజ్జనం చేశారు, కానీ చంద్రగ్రహణం కారణంగా, సెప్టెంబర్ 8న నిమజ్జనం కోసం మరొక గణపతిని మూర్తిని తరలించాల్సి వచ్చింది. అందుకని సెప్టెంబర్ 7 సాయంత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి భక్తులు గణపతి మండపం వద్ద గుమిగూడారు. వారు హనుమాన చాలీసా పారాయణ చేసిన వెంటనే ముస్లిం సమాజానికి చెందిన దుండగుల బృందం రాళ్లు రువ్వడం ప్రారంభించింది.దాంతో ఆ ప్రాంతమంతటా భయాందోళనలు వ్యాపించాయి . ఇరువైపులా ఘర్షణ వాతావరణం నెలకొంది. భక్తితో జరగాల్సిన గణేశ్ నిమజ్జన కార్యక్రమం హింసాత్మకంగా జరిగింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లర్లను అదుపులోకి తెచ్చారు.
ఈ దాడిలో అనేక మంది హిందువులు గాయపడ్డారు గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు, ఇతరులను పట్టుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని నిందితులను గుర్తించడానికి మండపం దగ్గర ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల డివిఆర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బాగ్రి ధృవీకరించారు. మరిన్ని సంఘటనలు జరగకుండా నిరోధించడానికి భారీగా పోలీసులను మోహరించాలని ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపా





