News

హిందూ యువతిపై సామూహిక అత్యాచారం

150views

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. అక్కడ ఓ హిందూ యువతిని కొందరు ముస్లిం వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆమె పై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఇస్లాంలోకి మార్చారు. ఈ కేసులో 14 మందిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం సంఘటన మార్చి 5నుండి ప్రారంభమైంది. ఫతేఫూర్ కి చెందిన రాధ అనే అమ్మాయి (పేరు మార్చాం)ని హసీన్, నవాబ్, ముక్తార్ అనే ముగ్గురు అబ్బాయిలు చాలాకాలంగా కిడ్నాప్ చేయాలని చూశారు. అవకాశం దొరికిన వెంటనే ఆమెను తమ కారులో కిడ్నాప్ చేసి కౌశాంబికి తీసుకెళ్లి తనను సన్నో అనే మహిళ ఇంట్లో ఉంచారు..ఆ తర్వత వారు ముగ్గురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ఆర్తనాదాలను ఎవరూ పట్టించుకోలేదు. సన్నో కూడా వారిని ప్రోత్సహించిందే తప్ప వద్దని వారించలేదు. తర్వాత, ఆ అమ్మాయి అక్కడి నుండ పారిపోతుందేమోనని భయపడి, ఆమెను ఫతేపూర్‌కు తిరిగి తీసుకువచ్చారు. అక్కడ వారు ఆమెను మరో అబ్బాయి ఖలీల్ ఇంట్లో బంధించారు. హసీన్ ఆమెపై అక్కడ కూడా చాలా రోజులు అత్యాచారం చేసి, ఎవరితోనైనా ఏదైనా చెబితే రెడ్ లైట్ ఏరియాకు అమ్మేస్తామని బెదిరించారు. భయంతో ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోయింది.

దీని తరువాత కూడా వారు సంతృప్తి చెందలేదు, హసీన్ , అతని సహచరులు ఆ అమ్మాయిని ఒక మౌల్వీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ వారు ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఆ మౌల్వీ ఆమెకు ముస్లిం పేరు పెట్టి ఇప్పుడు ఆమె ముస్లిం అమ్మాయి అని చెప్పాడు. ఆ అమ్మాయి నిరాకరించింది, కానీ బెదిరింపులకు భయపడింది. ఇదంతా హసీన్ ఆదేశం మేరకు జరిగింది. ఆ అమ్మాయి నెలల తరబడి వారి అదుపులో ఉంది. హసీన్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లు. అక్కడ అతని కుటుంబ సభ్యులు ఆమెను దుర్భాషలాడి, కొట్టేవారు. ఈ బాధలను భరించలేక ఆ అమ్మాయి అదను చూసుకుని పారిపోయి తన ఇంటికి చేరుకుంది. ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగినదంతా చెప్పింది. దీనిపై ఘాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాలిక ఫిర్యాదు ఆధారంగా 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో హసీన్, నవాబ్, ముక్తార్, ఖలీల్, సన్నో, మౌల్వి సహా అనేక మంది పేర్లు ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ హరినాథ్ సింగ్ తెలిపారు. కొందరు నిందుతులను పట్టుకునున్నారు. మరికొందరు పారిపోయారు. నిందితులందరినీ పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.