
ఈ మాట సరిగ్గా ఎవరు అనాలో వాళ్లే అన్నారు. వాళ్లు మాత్రమే అలా అనగలరు. ఆమె పేరు సాయేదా హమీద్, సోనియా గాంధీకి సన్నిహితురాలు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా ఈమె ప్రణాళికా సంఘం సభ్యురాలిగా ఉండేవారు. ఇటీవల ఈమె తోటి ఉద్యమకారులతో కలసి అస్సాంలో పర్యటించారు. బాంగ్లాదేశీయులు కూడా మనుషులే. కాబట్టి వాళ్లకి అస్సాంలో నివసించే హక్కు లేకుండా చేయడం సరికాదని ఆమె వాపోయారు. ఈ భూమి చాలా పెద్దదని కూడా ఆకాశమంత సత్యం మనందరికి బోధించారు.
దీనికి కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. మానవత్వం అనే మాటతో జనాన్ని పెడతోవ పట్టించవద్దని ఆయన హమీదాకు హితవు పలికారు. మానవత్వమే ఉంటే, పాకిస్తాన్, బాంగ్లాదేశ్లలో బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, సిక్కులు ఎందుకు అని అవస్థల పాలవుతున్నారని రిజిజు ప్రశ్నించారు. ఆమె సోనియాకో లేదా రాహుల్ కి సన్నిహితురాలు కావచ్చు. అయినంత మాత్రాన దేశంలోకి వచ్చిన చొరబాటుదారులను సమర్ధించడం సరికాదని కూడా రిజిజు అన్నారు.
ఈమె వెంట అస్సాం వెళ్లిన ఇంకో ఇద్దరి పేర్లు ఇక్కడ చెప్పుకోవాలి. ఒకరు ప్రశాంత భూషణ్, మరొకరు హర్షమందిర్. వీళ్లంతా ఖలిస్తాన్ సానుభూతి పరులైన రైతులను సమర్ధించే అర్బన్ నక్సల్. అస్సాం అడవులలో తిష్ట వేసిన బాంగ్లాదేశీయులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బయటకు పంపుతున్న నేపథ్యంలో హమీదా ఈ రీతిలో విలపించారు. అన్యాయమైన పద్ధతులలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారిని బాంగ్లాదేశీయులని చెబుతున్నారని అసలు విషయం బయట పెట్టారు హమీదా.
ఒకవేళ వాళ్లు బాంగ్లాదేశీయులే అనుకుందాం! అయినా వారు ఇక్కడ ఉంటే తప్పేమిటి? అని కూడా ఆమె ప్రశ్నించారు. భూమి చాలా పెద్దది. వారంతా ఇక్కడ ఉండవచ్చు అని చెప్పారామె. అస్సాం ముఖ్యమంత్రి చట్టవిరుద్ధంగా, చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ప్రశాంత భూషణ్ తేల్చి పారేశారు. ఈయన సుప్రీం కోర్టు న్యాయవాది అన్న సంగతి తెలిసిందే. అస్సాం ప్రభుత్వం పౌరులను తోలేస్తూ, ఇళ్లు కూలుస్తున్నదని అన్నారు.




