News

అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు

617views

చయిత్రి అరుంధతి రాయ్‌పై ఫిర్యాదు నమోదయింది. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా ప్రసంగించినందుకు ఆమెపై రాజీవ్‌ కుమార్‌ రంజన్ అనే న్యాయవాది దిల్లీలోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కోరారు. డిసెంబర్‌ 25న అరుంధతి రాయ్‌ దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. జాతీయ పౌర పట్టిక గణన సమయంలో తప్పుడు వివరాలను ఇవ్వవలసిందిగా ఆమె దేశ ప్రజలకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా మోదీ ప్రభుత్వానికి మిగతా నాలుగు సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇవ్వరాదని కూడా ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.