News

నేపాల్ లో గణేష్ నిమజ్జనంపై ముస్లింల రాళ్లదాడి…

171views

నేపాల్ లో గణేషుడిపై ముస్లింలు రాళ్లదాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. నేపాల్ లోని జనక్ పుర్దామ్ లో ఈ ఘటన ఆగస్టు మాసం 30 వ తేదీన గణేష్ నిమజ్జనాలు జరుగుతుండగా.. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణ రేగింది. జనక్‌పూర్‌ధామ్ సబ్-మెట్రోపాలిటన్ సిటీ-20లోని ఝండా చౌక్ వద్ద జరిగిన ఈ సంఘటన త్వరగా హింసాత్మకంగా మారింది.

కాశీభుయ్‌లోని చెరువులో గణేష్ నిమజ్జనం చేయడానికి ముస్లింలు వుండే ప్రాంతం గుండా గణేష్ శోభాయాత్ర సాగుతోంది. ఈ సమయంలోనే ముస్లింలు కొందరు ఊరేగింపును అడ్డుకోవడానికి, రోడ్డును మూసేయడానికి ప్రయత్నాలు చేశారు. దీనిని హిందువులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలోనే ముస్లింలు ఘర్షణకు దిగారు. అలాగే గణేష్ విగ్రహం వైపు రాళ్ళు రువ్వడంతో పరిస్థితులు మరింత దిగజారి, రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీసింది.

పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రాళ్ల దాడి తర్వాత జరిగిన మత ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ధనుషా పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ బహదూర్ సింగ్ ధృవీకరించారు.