News

బ్యూటీ పార్లర్లు నిషేధం… రహస్యంగా కూడా నడవొద్దు : తాలిబాన్ల హుకూం

187views

ఆఫ్గనిస్తాన్ లో ముస్లిం మహిళలపై తాలిబాన్లు మరింత పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే మహిళలపై కఠినతరమైన నిబంధనలను, ఆంక్షలను అమలు చేస్తున్నారు. తాజాగా మరో నిబంధనను కూడా అమలు చేస్తున్నారు తాలిబాన్లు.

మహిళల ప్రధాన ఆర్థిక వనరు బ్యూటీపార్లర్లే. ఈ ఆర్థిక వనరుపైనే తాలిబాన్లు దెబ్బతీస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం మహిళలు బ్యూటీ పార్లర్లు నడపొద్దని, వాటిపై నిషేధం విధించారు. అక్కడి అమ్మాయిలు బయటికి వెళ్లొద్దని తాలిబాన్లు హుకూం జారీ చేశారు. దీంతో వారు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు. ఓ వైపు ఆన్ లైన్ లో చదువుకుంటూనే, ఆదాయ వనరుగా బ్యూటీ పార్లర్లను నడుపుకుంటున్నారు. అలాగే కొందరు బ్యూటీ పార్లర్లలో కూడా పనిచేస్తున్నారు. ఇది కూడా ఎక్కడా బయటకు పొక్కకుండా పనిచేసుకుంటున్నారు.

నిజానికి 2023 లోనే తాలిబాన్ సర్కార్ దేశంలోని అన్ని బ్యూటీ పార్లర్లను అధికారికంగా మూసేసింది. అలాగే వాటిల్లో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది అమ్మాయిల ఉద్యోగాలను కూడా తీసేసింది. అయినా సరే మహిళలు, యువతులు అత్యంత రహస్యంగానే బ్యూటీ పార్లర్లు, వాటిల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు తాలిబాన్లు వీటిపై కూడా నిషేధంవిధించారు. ఇలా రహస్యంగా దేశ వ్యాప్తంగా నడుస్తున్న బ్యూటీ పార్లర్లను గుర్తించి, నివేదిక సమర్పించాలని కూడా తాలిబాన్ నేతలను ప్రభుత్వం ఆదేశించింది.