ArticlesNews

ప్రకాశ్ ఉత్సవ్ : జ్ఞానోదయం వెలుగు

139views

( భాద్రపద శుక్ల ప్రతిపాద – గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ )

గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ అనేది 1604లో స్వర్ణ దేవాలయంలో గురు గ్రంథ్ సాహిబ్ యొక్క మొట్టమొదటి ప్రకాష్, అంటే ప్రారంభ వేడుకను గుర్తుచేస్తుంది. 1604వ సంవత్సరంలో ఈ రోజున ఐదవ సిక్కు గురువు గురు అర్జన్ దేవ్ జీ దర్బార్ సాహిబ్‌లో సిక్కు పవిత్ర గ్రంథం యొక్క మొదటి ‘ప్రకాష్’ను ప్రారంభించారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సంకలనం ఆగస్టు 29, 1604న పూర్తయింది. 1604 సెప్టెంబర్ 1న పవిత్ర గ్రంథాన్ని స్వర్ణ దేవాలయంలో ప్రతిష్టించారు. అప్పటి నుండి, ఈ రోజును శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క ప్రకాష్ పురబ్‌గా జరుపుకుంటున్నారు. ఇది పంజాబీ నానక్షాయి క్యాలెండర్‌లోని ఆరవ నెల అయిన భడోన్ నెలలో 15వ రోజు జరుపుకుంటారు, ఇది సాధారణంగా పశ్చిమ క్యాలెండర్‌లోని ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో వస్తుంది. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క ప్రకాష్ పురబ్ దేశవ్యాప్తంగా భక్తి మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు మరియు నాగర్కీర్తన అని పిలువబడే మతపరమైన ఊరేగింపును వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. ఈ ఊరేగింపును పంజ్ ప్యారాలు అంటే ఎంపికైన ఐదుగురు నడిపిస్తారు. సర్వశక్తిమంతుడి ఆశీర్వాదం కోసం భక్తులు గురుద్వారాలను సందర్శించడంతో వేడుకలు తెల్లవారుజామున ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ యొక్క 421వ ప్రకాష్ పురబ్‌ను ఈరోజు అంటే ఆగస్టు 24న జరుపుకుంటున్నాము.

గురు గ్రంథ్ సాహిబ్ బహుశా ఒక మత స్థాపకుడు తాను జీవించి ఉన్న సమయంలో రాసిన ప్రపంచంలోని ఏకైక పవిత్ర గ్రంథమని చెప్పాలి. సిక్కుల మొదటి గురువు పవిత్ర శ్లోకాల సమాహారంగా గ్రంథ్ సాహిబ్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇతర గురువుల సంకలాలను ఇందులో జోడించారు. ఈ గ్రంథాన్ని ఆది గ్రంథ్ అని పిలుస్తారు. ఐదవ గురువు అర్జన్ దేవ్ జీ ద్వారా ఆది గ్రంథ్ స్థాపన అక్టోబర్ 16, 1604న శ్రీ హర్మందిర్ సాహిబ్‌లో జరిగింది. శ్రీ గురు హరగోబింద్ సాహిబ్ జీ పవిత్ర గ్రంథంలో రాంకలి కి వార్‌ను జోడించారు. తరువాత, పదవ సిక్కు గురువు గురు గోబింద్ సింగ్, గురు తేగ్ బహదూర్ శ్లోకాలను శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌కు జోడించారు. పదవ గురువు పవిత్ర గ్రంథాన్ని తన వారసుడిగా కూడా పేర్కొన్నాడు. 1708లో, ఆది గ్రంథ్ గురు గ్రంథ్ సాహిబ్ జీ అయింది. దీనిని సిక్కుల శాశ్వత గురువుగా గురు గోబింద్ సింగ్ జీ ప్రకటించారు. గురు గ్రంథ్ సాహిబ్ జీ సిక్కు గురువులు మరియు ఇతర సాధువులతో సహా అనేక విభిన్న పండితుల నుండి అనేక శ్లోకాలు, పద్యాలు, షాబాద్ మరియు ఇతర రచనల సంకలనం. దీనిని గుర్బని అని పిలుస్తారు, అంటే ‘గురువు నోటి నుండి’ అని అర్థం. ఇది గుర్ముఖిలో వ్రాయబడింది.

గురు గ్రంథ్ సాహిబ్ అనేది సిక్కు మతం యొక్క కేంద్ర పవిత్ర మత గ్రంథం మరియు సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను తమ శాశ్వత జీవన గురువుగా భావిస్తారు. సిక్కులందరూ దాని ముందు నమస్కరించి గురుద్వారాలలో మరియు వారి ఇళ్లలో దాని శ్లోకాలను పఠిస్తారు. సిక్కులు ఏ శరీరం, విగ్రహం లేదా సమాధి ముందు తల వంచకూడదని గురు గోవింద్ సింగ్ జీ ఆదేశించిన కారణంగా వారు గురు గ్రంథ్ సాహిబ్‌నే ప్రకాశ్ ఉత్సవ్‌గా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ప్రతీది దేవుని చిత్తానికి అనుగుణంగా జరుగుతుందని సిక్కులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఎంతో వినయపూర్వకంగా గురు గ్రంథ్ సాహిబ్‌ను తెరచి ఎడమ వైపున ఉన్న శబద్ అంటే కీర్తనను హుకుమ్నామా అంటే ఆధ్యాత్మిక సలహాగా భావిస్తూ ఆచరిస్తారు. ఈ హుకుమ్నామాను సిక్కులు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రత్యేక రోజున అనుసరించాల్సిన గురు ఆజ్ఞగా పరిగణిస్తారు. శ్రీ దర్బార్ సాహిబ్ ప్రతి సిక్కు జీవితంలో కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది. అమృత్‌సర్‌లోని గురు సాహిబ్‌లు కోరేది ఒక్కటే, అదే ప్రతి సిక్కు శ్రీ దర్బార్ సాహిబ్‌కు తిరిగి ఇవ్వడం..దీన్నే వారు అత్యంత స్వచ్ఛమైన సేవలలో ఒకటి అంటారు.