
కేరళలోని కొట్టారక్కరలో లవ్ జిహాద్ కు సంబంధించిన పోక్సో కేసులో నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ ఐక్య వేదిక , విశ్వ హిందూ పరిషత్ రూరల్ ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఆ యువకుడు ఒక విద్యార్థినిని బెదిరించి, ప్రేమ ముసుగులో ఆమెను మతం మార్చడానికి ప్రయత్నించాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదిచ్చినప్పటికీ నిందితుడిని అరెస్టు చేయలేదు. పోలీసులు అతనిపై చర్య తీసుకునే బదులు అతన్ని రక్షిస్తున్నారనేది హిందూ సంఘాల ఆరోపణ.
స్థానిక మణికందన్ అల్తార నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. ఈ పాదయాత్రను మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు బిందుమోహన్ ప్రారంభించారు.ఈ ప్రసంగంలో వారు మాట్లాడుతూ పోలీసులు హిందూ, క్రైస్తవ వర్గాలను పణంగా పెట్టి మరీ ఒక మతానికి వన్నెపాడుతున్నారని ఆరోపించారు. లవ్ జిహాద్‌ను చట్టబద్ధంగా నిషేధించాలని , కొట్టారక్కర కేసులో నిందితులను ఆలస్యం చేయకుండా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక నిరసనలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజి ప్రసాద్ మాట్లాడుతూ, కేరళ ఇప్పుడు అత్యధికంగా యువతుల ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రంగా మారింది. ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం, బెదిరింపులు, బలవంతం ,దుర్వినియోగం వంటి చర్యలే దీనికి కారణమని ఆయన ఆరోపించారు. లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రభుత్వ మంత్రులతో సహా, నాయకులు వాటి ఉనికిని నిరాకరిస్తున్నారని ఆయన విమర్శించారు. కొట్టారక్కర కేసులో పోలీసుల నిష్క్రియాత్మకతకు వ్యతిరేకంగా జరిగే అన్ని నిరసనలకు బిజెపి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మంజప్పర సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వీహెచ్‌పీ ప్రాంతీయ కార్యదర్శి సుధాకరన్ మారూర్, హిందూ ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి తెక్కడం సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు తాళ్లవూరు గోపాలకృష్ణన్, బీజేపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు రాజిప్రసాద్, మహిళా ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి అలీల పొన్ను, హిందూ ఐక్య వేదిక తాలూకా అధ్యక్షుడు డాక్టర్ హరి రామ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.





