News

పాక్ కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా & భారత్

609views

గ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా కొమ్ముకాస్తూ వస్తోంది పాకిస్థాన్. ఆ విషయాన్ని ఆ దేశ నాయకులే ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. భారత్ కూడా ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ ను హెచ్చరిస్తోంది. తీరు మార్చుకోమని చెబుతున్నా కూడా వినకుండా తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూనే ఉంది. అందుకే అగ్ర దేశాల నుండి ఇప్పటికే తీవ్ర ఒత్తిడి తీసుకొని వస్తున్న భారత్,  అమెరికాతో కలిసి పాక్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

వాషింగ్టన్ లో జరుగుతున్న చర్చల్లో భారత్-అమెరికా దేశాలు ఉగ్రవాద నిర్మూలనపై కలిసి పని చేయడానికి అంగీకరించాయి. అమెరికా మంత్రులు మైక్ పాంపియో, మార్క్ ఎస్పర్ తో భారత కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, జైశంకర్  చర్చలు జరిపారు.  ఉగ్రవాదుల గుర్తింపునకు భారత చట్టాల్లో మార్పు చేయడాన్ని అమెరికా స్వాగతించడం విశేషం. పాకిస్థాన్ ను భారత్, అమెరికా హెచ్చరించాయి. ఉగ్రవాద నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పాయి. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఇటీవలే గుర్తించారు. అందుకు ముఖ్య కారణం అమెరికా అని భారత్ చెప్పుకొచ్చింది. ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న పాకిస్థాన్  ఉగ్రవాద నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.