
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాతన శివాలయం విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ పురాతన శివాలయంతో పాటుగా ఇక్కడ శ్రీ కృష్ణుడిపురాతన ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలన్నీ వెయ్యి సంవత్సరాల పురాతమైనవి. అయితే గత కొంత కాలంగా ఈ ఆలయంని ఆక్రమించడానికి ముస్లిం వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అక్కడ వారి దర్గాను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ తో పాటుగా, వివిధ హిందూ సంస్థలు శ్రావణ సోమవారం సందర్భంగా ఈ పురాతన ఆలయాన్ని చేరుకుని పూజలు నిర్వహించారు. అంతేకాక ఇకనుండి ఈ ఆలయంలో రోజూ పూజలు చేస్తామని మందిర్ సంరక్షణ్ సంఘర్ష్ సమితి , బిజెపి సహా హిందూ సంస్థలు ఈ సందర్భంగా ప్రకటించాయి. ఆలయ రూపాన్ని మార్చి సమాధి రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరిగిందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అక్కగ ఉన్న ఆలయ రూపురేఖలని చూస్తే ఎవరైనా ఇది పురాతనమైన ఆలయం అని ఇట్టే చెప్పేస్తారు. అయితే ఆలయం వద్ద హిందువులు పూజలు చేయడానికి వచ్చారు అని తెలియగానే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో సమాదివద్దకు రావడం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. . పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి వెనక్కి పంపించారు. ఇది హిందూ మతపరమైన ప్రదేశం అని ఇక్కడ నెలకొని ఉన్న సమాధిని తీసివేయాలని ఈ సందర్భంగా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




