
తమిళనాడులో కొంతమంది డీఎంకే పార్టీ మొప్పు పొందడానికి హిందువులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. అలాంటి వారిలో ఒకరుగా మనం ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని చెప్పొచ్చు.
ప్రముఖ గేయరచయిత, కవి వైరముత్తు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనేకాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రాచీన తమిళ కవి కాంబర్ పేరుతో అందించే అవార్డును స్వీకరిస్తూ మాట్లాడిన ఆయన, రాముడి వ్యక్తిత్వంపై చేసిన ఒక వ్యాఖ్యతో మతపరమైన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం రేపారు. “సీతను కోల్పోయిన తర్వాత రాముడు మానసిక సమతుల్యత కోల్పోయాడు, వాలిని చంపడానికి అది కూడా ఒకకారణం” అంటూ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆయన చెప్పిన మాటలు హిందూ సమాజంలో అసహనం కలిగించాయి. ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో, దాని చుట్టూ చర్చలు, విమర్శలు, వాదోపవాదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ వ్యాఖ్యకు మూలం కాంబర్ రచించిన “కాంబ రామాయణం”లోని ఒక కీలక సంభాషణ. ఇందులో వాలి అనే పాత్ర, రాముడి నిర్ణయాలను ప్రశ్నించే సందర్భం ఉంటుంది. వాలి, రాముడి పరిపాలనలోని విరుద్ధతలను చూపిస్తూ, “రాజ్యాన్ని అన్నయ్య కోసం వదిలేసిన నువ్వు, అడవిలోకి వచ్చాక వాలి రాజ్యాన్ని వాలి తమ్ముడికి ఎలా ఇచ్చావు?” అని ప్రశ్నిస్తాడు. ఈ సందర్భంలో, వాలి సీతను కోల్పోవడం వల్ల రాముడు మానసిక స్థిరత్వాన్ని కోల్పోయాడని వ్యాఖ్యానిస్తాడు. వైరముత్తు ఈ సన్నివేశాన్ని ఉదహరిస్తూ, కాంబర్ సాహిత్యంలోని కోణాన్ని వివరించారు.
భగవాన్ రామ్ పై వైరముత్తు చేసిన వ్యాఖ్యలను బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంథిరన్ ఖండిస్తూ, X లో ఇలా ఖండించారు, “ఆయన ‘ఆళ్వార్స్ రీసెర్చ్ సెంటర్’ స్థాపించడం ద్వారా వైష్ణవ భక్తిని వ్యాప్తి చేస్తానని చెప్పుకోవడమే కాకుండా, కంబ రామాయణంపై పరిశోధన చేస్తున్నట్లు చెప్పే డిఎంకె ఎంపి జగత్రాక్షకన్ మరియు రామాలయ నిర్మాణానికి నిధులు విరాళంగా ఇచ్చినట్లు గర్వంగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ – వారు శ్రీ వైరముత్తు హిందూ వ్యతిరేక వైఖరిని ఆమోదిస్తారా?” అంటూ వారు పోస్టు చేశారు.
అయితే వైరముత్తు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్త కాదు. 2019లో కూడా ఆండాళ్ (గోదాదేవి)ని ఒక దేవదాసి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2019లో రాముడు మరియు కంబర్ గురించి రాసిన తమిళజత్రుపదై అనే పుస్తకాన్ని విడుదల చేసిన తర్వాత వైరముత్తు భగవాన్ రామ్ పై అదే వ్యాఖ్యలు చేశారు. కొన్ని ముస్లిం సంస్థలు కూడా దీనిని తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు ముస్లిం లీగ్ (TNML) వ్యవస్థాపక అధ్యక్షుడు VMS ముస్తఫా మాట్లాడుతూ, “ఏ హిందూ దేవుడైనా, లేదా యేసు అయినా, లేదా అల్లా అయినా, దేవుళ్లను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదు. దేవుళ్లను దుర్వినియోగం చేయడం ప్రజల మనోభావాలను దుర్వినియోగం చేయడమే, మరియు ఏదైనా చిన్న సమూహం ఈ అంశాన్ని చేపడితే అది హింసకు దారితీయవచ్చు. భగవాన్ రామ్ మరియు కంబర్ లపై దుర్వినియోగ వ్యాఖ్యలకు వైరముత్తుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.” అంటూ ఆ సమయంలో వ్యాఖ్యానించారు. అయితే ఆసమయంలో అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కానీ . DMK మద్దతుతో ఆ కేసు దాదాపు దశాబ్ద కాలంగా FIR దశ దాటి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు.
DMK MP జగత్రక్షకన్ ఆళ్వార్ పరిశోధనా కేంద్రం తాజాగా వైరముత్తుకు “కంబన్ అవార్డు” (తమిళంలో రామాయణం రాసిన పన్నెండు వైష్ణవ సాధువులలో ఒకరైన కంబనత్తళ్వార్‌గా పరిగణించబడే కంబన్ పేరు పెట్టబడింది) ప్రదానం చేసింది. కానీ ఆయన హిందూ దేవుళ్లపై చేస్తున్న ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తుంటే ఆ నియామకం తప్పు అనే చెప్పవచ్చు. కేవలం ఇవి మాత్రమ కాదు వైరముత్తుపై మీటూ నుండి అనేక లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వైరముత్తుకు డిఎంకె ఎంపి జగత్రక్షకన్ ఆళ్వార్ రీసెర్చ్ సెంటర్ కవి చక్రవర్తి కంబన్ అవార్డును ప్రదానం చేయడం గమనార్హం.




