
ఉత్తరాండ్ లోని ధరాలిలో ఉత్తరకాశీ ప్రకృతి విధ్వంసం అక్కడి వారిని అతలాకుతలం చేసింది. ఓ గ్రామానికి గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఈ వరద బీభత్సం నేపథ్యంలో అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, ఆదుకోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముందుకొచ్చింది. అనేక మంది స్వయంసేవకులు ఇప్పటికే సేవా కార్యక్రమాల్లో మునిగితేలారు.ఆస్పత్రిలో సేవలు చేయడం, ఆహారం అవసరం వున్న వారికి ఆహారపు ప్యాకెట్లు అందజేయడం, నిర్వాసితులైన వారికి సహాయాలు చేస్తున్నారు.
అయితే.. 70 ఏళ్ల గులాబ్ సింగ్ నేగీ అనే స్వయంసేవక్ యువకులతో కలిసి అంతే వేగంగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నైపోయారు. యువకులతో కలిసి అంతే వేగంగా, అలిసిపోకుండా కొండలు, గుట్టల్లో పనిచేస్తున్నారు. నిస్వార్థ సేవకు వయస్సు అడ్డంకే కాదని నిరూపిస్తున్నారు.
బాధిత నివాసితులకు రేషన్ కిట్లు, ఆహార సామాగ్రి మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. నిరాశ్రయులైన కుటుంబాలకు వసతి కల్పించడానికి తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాట్లు చేయడంలో స్వయంసేవకులు నిమగ్నమయ్యారు. 24 గంటలూ స్వయంసేవకులు ఈ పనిలో నిమగ్నమైపోయారు. గులాబ్ సింగ్ నేగీ అనే 70 ఏళ్ల స్వయంసేవక్ కూడా ఈ పనులన్నింటిలోనూ నిమగ్నమైపోయారు.
ఈ సహాయ కార్యక్రమాల సమయంలో ఆటంకాలు కూడా వస్తున్నాయి. రోడ్లు దెబ్బతినడం, వంతెనలు కూలిపోవడం, నడవడానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయినా స్వయంసేవకులు మాత్రం స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సహాయం చేస్తూనే వున్నారు.
క్లౌడ్ బస్టర్తో ఉత్తర కాశీ అతలాకుతలమైంది. ఓ గ్రామానికి గ్రామమే కొట్టుకుపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గంగోత్రి జాతీయ రహదారిపై 90 అడుగుల బెయిలీ వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. గంగ్నానీ, హర్సిల్ మధ్యన బెయిలీ మాడ్యులర్ వంతెనను ఒక్క రోజులోనే సైన్చం, సరిహద్దు రోడ్ల సంస్థ కలిసి నిర్మించాయి. దీంతో ప్రత్యామ్నాయ రహదారి సిద్ధమైంది. సహాయక సామాగ్రిని తరలించడంలో కాస్త ఉపశమనం లభించింది. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 మందిని తరలించారు.




