News

సింగిల్ విండో ద్వారా గణేశ్ మండపం అనుమతులు ఇవ్వాలి

720views

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు,Ex MP అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు శ్రీ రమణ కుమార్ గారు Rtd IPS,
ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు, కార్యదర్శి శ్రీ వి.దుర్గా ప్రసాద్ రాజు గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఇంచార్జ్ శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ విజయానంద్ తో సమావేశమైయ్యారు.

ఈ సందర్బంగా రాష్ట్రంలో రాబోయే గణేష్ ఉత్సవాల కోసం నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టకుండా సింగిల్ విండో పద్ధతిలో గణేష్ మండపం వారు ఇచ్చే విజ్ఞాపన పత్రం ఆధారంగా ఎలాంటి రుసుము తీసుకోకుండా అన్ని రకాల విభాగాల ద్వారా స్వచ్ఛంద అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే మండపాలకి ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పించాలని, నిమజ్జన శోభాయాత్ర రోజున ప్రత్యేక అలంకరణ సాంస్కృతి కార్యక్రమాలు నిమజ్జన స్థలంలో క్రేన్లు వేదికలు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మండపాల వాహనాలతో డీజే పెట్టుకోవడానికి ఎలాంటి నియంత్రణ పెట్టకూడదని కకోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.