News

దుర్గమ్మ దర్శనాలకొచ్చే ప్రముఖులు ముందే సమాచారమివ్వండి

219views

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రముఖుల రద్దీ పెరిగి ప్రొటోకాల్‌ ఇబ్బందులు వస్తుండడంతో సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో శీనానాయక్‌ గురువారం ప్రకటించారు. ‘‘ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర వ్యవస్థలకు చెందిన ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు దర్శనానికి వచ్చే సమయంలో వారికి సంబంధించిన సమాచారం ముందే దేవస్థానానికి అందించాలి. తద్వారా ప్రొటోకాల్‌ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఇందుకు ప్రముఖులు సహకరించాలి’’ అని ఈవో కోరారు. ఇక నుంచి సిఫార్సులపై వచ్చే వాళ్లు కచ్చితంగా సంబంధిత ప్రజాప్రతినిధి, అధికారుల లెటర్‌ హెడ్‌ లేదంటే పేపర్‌పై దర్శనాలకు వచ్చే వారి పేర్లు, వివరాలు రాసి ప్రముఖుల సంతకాలు చేయించి తీసుకురావాలి’’ అని శీనానాయక్‌ పేర్కొన్నారు.