News

మరోసారి భారత్‌పై పాక్ అసత్య ఆరోపణలు.. కాశ్మీర్ మాదేనంటూ వ్యాఖ్య!

205views

పాకిస్తాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్‌ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్‌ ప్రధాన కారణమని నోరు పారేసుకున్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతిస్థాపన కోసం 2019లో భారత సర్కార్ ఆర్టికల్‌ 370 రద్దు చేయడంపై కూడా అతడు తన అక్కసు వెళ్లగక్కారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుందని భారత్‌పై నిందలు వేశారు. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారానికి తమ విదేశాంగ విధానం కట్టుబడి ఉందంటూ పాక్ పీఎం షెహబాజ్‌ షరీఫ్ మళ్లీ పాత పాటే పాడారు.