
351views
మన ఊరు-మన గుడి-మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని దేవాలయాలను కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరుతో శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఎన్నో ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను శివకుమార్ రెడ్డి వారి బృందం ఉద్యమ స్ఫూర్తితో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిలో కొన్ని

లాంటి ఎన్నో ధార్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో భాగంగా గత ఆదివారం “మన ఊరు మన గుడి మన బాధ్యతకు చెందిన 104 మంది వాలంటీర్స్ బృందం ముఖ్యంగా మంత్రాలయం వద్ద 500 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న తుంగభద్ర నది ఘాట్ నుండి చెత్తను, బట్టలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నదిలో విసిరిన మద్యం సీసాలు, షాంపూ వ్యర్ధాలు మొదలైన వాటిని తొలగించారు. ఈ సందర్బంగా తుంగభద్ర నది ఒడ్డున 5 ట్రాక్టర్ల చెత్తను తొలగించి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రాంగణాన్ని కూడా శుభ్రం చేశారు.




