News

రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు..

294views

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈనెల 8 నుంచి 14 వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు జరగనున్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాలకు సకల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు తెలిపారు. ఈనెల 8 నుంచి 13వ తేది వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో సోమవారం శ్రీ మఠం గురునివాస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా 10వ తేదీన పూర్వరాధన, సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజులు, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. 11వ తేదిన మద్యారాధనలో భాగంగా మూలబృందావనానికి మమాపంచామృతాభిషేకం, పాదుకా పట్టాభిషేకం, స్వర్ణరథోత్సవం నిర్వహిస్తామన్నారు. 12వ తేదిన ఉత్తారారాధనలో భాగంగా మూలబృందావనానికి వజ్రరత్నకవచధారణ, వసంతోత్సవం, మహారథోత్సవం కనులపండువగా చేపడతామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశామని.. వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్‌ సదుపాయం కల్పిస్తా

ఈ సందర్భంగా శ్రీ మఠం అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఉత్సవాలకు ఆహ్వానించారు. సీఎం నివాసంలో రాఘవేంద్ర స్వామి మఠం సహాయ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపరింటెండెంట్‌ అనంతపురాణిక్‌లు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. రాఘవేంద్ర స్వామి జ్ఞాపక ఫలమంత్ర అక్షింతలు అందజేశారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసు, ససజ్జల రామకృష్ణారెడ్డిలకు కూడా జ్ఞాపిక ఇచ్చి రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలకు ఆహ్వానించారు.