News

రాఖీల సిందూరం

227views

సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌కు ఈసారి దేశభక్తిని జోడించారు ఆ ఊరి ఐఐటీ విద్యార్థులు. తాము తయారు చేసిన దాదాపు 2వేల ‘ఆపరేషన్‌ సిందూర్‌’ రాఖీలను ఈ నెల 9న (శనివారం) రక్షాబంధన్‌ పండుగ వేళ ప్రధాని మోదీతోపాటు సరిహద్దుల్లోని భారత సైనికులకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత సైన్యం చూపిన తడాఖా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న తీరుకు అద్దంపట్టేలా ఒక ప్రత్యేక రాఖీని ప్రధాని మోదీకి పంపనున్నట్లు బిహార్‌లోని గయా జిల్లా పట్వటోలీ గ్రామ విద్యార్థులు వెల్లడించారు. పట్వటోలీని ఐఐటియన్ల గ్రామం అని పిలుస్తుంటారు.