News

ఉర్దూ నేర్చుకోవాలంటూ బలవంతం.. ప్రిన్సిపాల్ సస్పెండ్

274views

యూపీలోని బిజ్నోర్ లోని ఓ ముస్లిం పాఠశాల ప్రిన్సిపాల్ ను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తమపై ఉర్దూ భాషను బలవంతంగా రుద్దుతున్నారని, ఉర్దూ నేర్చుకోవాల్సిందేనని రోజూ ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నాడని అక్కడి హిందూ విద్యార్థులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వం విచారణ జరిపి, మహ్మద్ సలావుద్దీన్ అనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసింది.

అంతేకాకుండా ఉర్దూను బలవంతంగా రుద్దడంతో పాటు హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడని విద్యార్థులు వెల్లడించారు. భాషపరంగా తమపై వివక్ష కూడా చూపిస్తున్నాడని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే.. ప్రిన్సిపాల్ తీరుకు నిరసనగా హిందూ విద్యార్థులు పాఠశాల బయట నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం బయటపడింది.

‘ఎవరైనా దేవుడ్ని చూశారా.. అసలు దేవుడే లేడు. అని అంటున్నాడు. అంతేకాకుండా ఉర్దూ నేర్చుకోవడానికి నిరాకరిస్తే మమ్మల్ని అస్సలు పట్టించుకోవడమే లేదు.’’ అని ఓ విద్యార్థి పేర్కొన్నాడు.
దీంతో ప్రభుత్వ అధికారులు పాఠశాలకు వచ్చి, దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడటంతో ప్రిన్సిపాల్ మహ్మద్ సలావుద్దీన్ ను సస్పెండ్ చేశారు. తర్వాత మరో పాఠశాలకు బదిలీ చేశారు.

మరోవైపు ఉర్దూను నేర్చుకోవాల్సిందేనంటూ ప్రిన్సిపాల్ విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, వేధించాడని కూడా అధికారులు తమ దర్యాప్తులో స్పష్టంగా పేర్కొన్నారు. ఉర్దూను నేర్చుకోవడానికి ముందుకు రాని విద్యార్థులను అస్సలు పట్టించుకోలేదని కూడా తమ రిపోర్టులో పేర్కొన్నారు.